News

సోమేశ్వరుడి ఆదాయం 11 లక్షలు

266views

భీమవరం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి వార్ల ఆలయంలో హుండీలను తెరచి లెక్కించగా 97 రోజులకు 11 లక్షల 40వేల 352 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఈ లెక్కిం పును యనమదర్రు శక్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో కె.శ్రీని వాసరావు పర్యవేక్షించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.