
218views
ఉంగుటూరు మండలంలోని మానికొండ శ్రీ పద్మావతి ఆండాళ్ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల 23వ వార్షిక శాంతి కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. గ్రామపెద్దలు గోగినేని వెంకటేశ్వరరావు, చింతా శ్రీని వాసరావు(వాసుబాబు), గ్రామస్ధుల సహకారంతో, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు ఆరికట్ల రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పరుచూరి మురళీమోహన్ ఆధ్వర్యంలో సుమారు 40మంది దంపతులు కుటుంబ సమేతంగా కల్యాణోత్సవంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ముదిగొండ నాగరాజు, కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, మద్దుల అమర్‌నాథ్ పాల్గొన్నారు.




