News

పుల్వామా అమర వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు – ప్రధాని మోదీ

298views

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్‌లోకి భారత సైన్యం ప్రవేశించి మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు.