News

నేడే శ్రీవాణి దర్శన – ఆర్జిత సేవా టికెట్లు విడుదల!

160views

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. శ్రీవాణి దర్శన ..సేవా టికెట్లను ఈ రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న వేసవిలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లకు సిద్దం అవుతోంది. కాటేజీల పునరుద్దరణతో పాటుగా తిరుమలలో కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్తగా శ్రీవారి పరాకమణి ద్వారా హుండీల లెక్కింపు ప్రారంభించింది. టీటీడీ తాజా ఆవిష్కరించిన యాప్ కు మంచి స్పందన కనిపిస్తోంది. ఇక.. ఈ రోజు శ్రీవారి సేవతో పాటుగా వసతి..అదే విధంగా సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది. వీటిని టీటీడీ వెబ్ సైట్ ..యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

శ్రీవారి భక్తుల సౌకర్యార్దం ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు శ్రీవాణి దర్శన టికెట్లు.. వసతి గదులను ఈ రోజు మధ్నాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నేటి మధ్నాహ్నం నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా తాజాగా ఆశిష్కరించిన TTDevathanams యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 22 నుంచి 28 వరకు గల శ్రీవారి ఆర్జిన సేవా టికెట్ల ఆన్ లైన్ డిప్ లో పాల్గొనేందుకు భక్తులు ఈ రోజు (బుధవారం) ఉదయం 10 నుంచి పదో తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ నెల 22 నుంచి 28వ తేదీకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు (బుధవారం) మధ్నాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.