News

మనువాదం, హిందుత్వం… హింస, హత్యలు, విచ్చిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయి – కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

50views

మనువాదం, హిందుత్వం… హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందువులకు హిందూత్వంతోనే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అన్నారు. తాను కూడా హిందువునేనని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా నిలబడతానని పేర్కొన్నారు. ‘‘హిందుత్వం వేరు హిందు ధర్మం వేరు. నేను కూడా హిందువునే. కానీ, మనువాదానికి, హిందుత్వానికి వ్యతిరేకిని. ఏ మతమైనా హత్యలను, హింసను ప్రోత్సహిస్తుందా..? కానీ, మనువాదం, హిందుత్వం మాత్రం హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రోత్సహిస్తాయి. హిందూ ధర్మానికి, హిందుత్వానికి ఉన్న తేడా అదే’ అని సిద్దరామయ్య అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలో పెద్దఎత్తున దుమారం చెలరేగుతోంది. మరో కొన్ని నెలల్లో కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో సిద్దారామయ్య హిందుత్వంపై దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.