News

వైభవంగా దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు

389views

కడప (Kadapa) నగరంలో వెలిసిన సుప్రసిద్దమైన ప్రతిష్టాత్మక తిరుమల తొలి గడప, దేవుని కడపలోని శ్రీ లక్షీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నాలుగవ రోజు(గురువారం) తెల్లవారుజామున నుంచి శ్రీవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక హోమాలు అభిషేకాలు నిర్వహించారు. ఈ రోజు మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు నడుమ దేవుని కడప మాడ వీధులలో శ్రీవారిని కల్పవృక్ష వాహనంపై ఊరేగించారు. భక్తులు అడుగడుగునా శ్రీవారికి కర్పూర నీరాజనాలు పలికారు లక్ష్మి పుర వీధుల వెంట భక్తుల గోవింద నామస్మరణల మద్య వైభవంగా జరిగిన ఈ వేడుకకి నగరంలోని భక్తజనం విశేషంగా హాజరై శ్రీవారిని దర్శించుకున్నారు.