
259views
కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధి చింతగుంటపాలెంలో తెలుగు రైతు పిప్పళ్ళ వెంకట కాంతారావు ఇంటి వద్ద సంప్రదాయ సిద్ధంగా గోమాతకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గోమాతను దైవంగా భావిస్తూ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదపండితులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతగుంటపాలెంలో గో ప్రేమికులు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి సోమశేఖర్, లంక శెట్టి నీరజ, పాలపర్తి పద్మ , పలువురు కార్పొరేటర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ స్వయంగా గోమాతకు అర్చనలు చేశారు. ఈ సందర్బంగా హిందూ సంప్రదాయాలను గౌరవించే వారు గోమాతను ప్రత్యక్షదైవంగా భావించాలని పలువురు కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని గో ప్రేమికులు పేర్కొన్నారు.





