
346views
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గ్రామంలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. తెలుగు ప్రజలకు ఇది పెద్ద పండుగ కావడంతో వలస జీవులంతా స్వగ్రామాలకు చేరుకుని వేడుకలు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు, పల్లెపాటలు, చెక్క భజన, కోలాటం, తప్పెటగుళ్ల ప్రదర్శన హుషారెత్తిస్తున్నాయి.





