
FILE - American Airlines planes sit stored at Pittsburgh International Airport on March 31, 2020, in Imperial, Pa. Federal officials said Wednesday Jan. 4, 2023, that American Airlines retaliated against flight attendants who complained about jet fuel fumes seeping into airplane cabins. (AP Photo/Gene J. Puskar, File)
311views
అగ్రరాజ్యం అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా కంప్యూటర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మొత్తం విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాడే సాఫ్ట్‌వేర్‌లో ఈ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతానికి ఒక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సమస్య ఎప్పటికల్లా పరిష్కారమవుతుందనేది తెలియడం లేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించే వరకూ విమానాలను ఎగరనీయవద్దని సంబంధిత అధికారులు నిర్ణయించారు. అమెరికాలో తలెత్తిన ఈ సమస్య ప్రభావం గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్‌పై కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.





