News

తమిళనాడులో బాలిక పట్ల చర్చి పాస్టర్‌ అసభ్య ప్రవర్తన!

278views

తమిళనాడులో ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన పాస్టర్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు పాస్టర్ ఆండ్రూస్‌గా వారు గుర్తించారు. బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటన డిసెంబర్ 14వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక, ఆమె సోదరుడు చర్చి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలో చదువుతున్నారు. వసతి గృహం కూడా ఉండటంతో అక్కడే ఉంటున్నారు. దీనిని పాస్టర్ ఆండ్రూస్‌ అతని అతని భార్య కలిసి నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో క్రిస్మస్ సెలవుల సందర్భంగా బాలిక హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి హాస్టల్‌కు రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు వెళ్లవని ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా… అసలు విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 14న బాలిక చర్చికి వెళ్లకుండా హాస్టల్‌ గదిలోనే ఉండిపోయింది. దీన్ని గమనించిన ఆండ్రూస్‌ ఎందుకు హాస్టళ్లో ఉన్నావని ప్రశ్నించగా.. ఆ బాలిక తన ఒంట్లో బాలేదని సమాధానం ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన ఆండ్రూస్‌ బాలికను దూర్భాషలాడాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తనను బెదిరించాడని బాలిక పోలీసులకు తెలిపింది.

 

source- vsk bharath