
303views
జస్పూర్ నగర్: ఛత్తీస్‌గఢ్‌లోని జస్పూర్ నగర్లో గిరిజన మహావీరుడు భగవాన్ బిర్సా ముండా విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) సంఘచాలక్ పరమ పూజనీయ మోహన్ జీ భాగవత్ నిన్న(నవంబర్ 14) ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించేందుకు బిర్సా ఎనలేని కృషి చేశారని తెలిపారు. గిరిజన సంస్కృతి అంటే సనాతన భారతీయ సంస్కృతి అని, దీనిని పరిరక్షించేందుకు ప్రతి భారతీయుడు నిరంతరం కృషి చేయాలని కోరారు. జస్ట్ పూర్ రాజా దిలీప్ సింగ్ జి దేవ్ శిలా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన మోహన్ జీ… మతం మారిన గిరిజనులను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకురావడంలో దిలీప్ సింగ్ జీ దేవ్ విశేషంగా పాటుపడ్డారన్నారు.