
391views
నంద్యాల: నంద్యాల జిల్లాలోని చిన్న కంబలూరు గ్రామంలో విశిష్ట వ్యక్తుల పరిచయ వర్గ్( సజ్జన శక్తుల సమీకరణ/ఏకీకరణ) రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స్థానిక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రధాన వక్తలు మాట్లాడుతూ సంఘ్ కార్య శైలిని, సామాజిక, ఆధ్యాత్మిక, ధర్మ జాగరణ పనులను వివరించారు. ఈ సందర్భంగా పలువురు విశిష్ట వ్యక్తులు సంఘ్‌ను అభినందించారు. తామూ ఇటువంటి సేవా కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సహ కార్యవాహ యుగంధర్, నంద్యాల జిల్లా సంఘ్‌చాలక్ చిలుకూరి శ్రీనివాసులు, జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ రాఘవ, జిల్లా కార్యకారిణి మార్తుల జనార్దన్ రెడ్డి, జిల్లా వ్యవస్థా ప్రముఖ్ భూమా దస్తగిరి రెడ్డి, ఖండ కార్యవాహ ఆవుల మల్లికార్జునలతోపాటు 43 మంది విశిష్ట వ్యక్తలు పాల్గొన్నారు.