News

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ కన్నుమూత

398views

భాగ్యనగరం: తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ(80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తీశారు. స్టూడియా నిర్మించి.. ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. భారతీయ సినిమా రంగంలో లెజెండ్ అనిపించుకున్నాడు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి