News

ఎస్సీ వర్గీయులకు భవానీ దీక్ష దుస్తుల పంపిణీ

446views

నంద్యాల: నంద్యాల జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన వారిని మార్గదర్శనం చేసి, వారు దైవదీక్ష పుచ్చుకునేందుకు అవసరమైన సామగ్రిని దాతల నుంచి సేకరించి సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు శనివారం పంపిణీ చేశారు. ఈ విధానం వల్ల వారు ప్రస్తుత సామాజిక వాతావరణంలోని మతోన్మాదుల భ్రమల్లో పడక మాతృఛాయలోనే కొనసాగుతున్నారు.

స్థానిక ఎస్సీ వాడకు చెందిన మద్దిలేటి, చంద్రమౌళి, సుబ్బారాయుడు, సిలవయ్య, శివ, ప్రదీప్, బాలరాజు, దుర్గ, తమడపల్లే ఎస్సీ వాడకు చెందిన నాగన్న, బాల ఈశ్వరయ్య, గౌతమ్, సుధాకర్, సలెన్నలకు భవానీ దీక్ష దుస్తుల పంపిణీ చేశారు.

దాతలు వెంకటేశ్వర్లు వెంకీ ఆర్ట్స్, లక్ష్మి ప్రసాద్, చిలుకూరి శ్రీనివాసులు, కన్యక మోహన్, సముద్రాల నాగరాజు, లయన్, శ్రీకాంత్, మురళి కృష్ణ, డాక్టర్ భార్గవ రెడ్డి, శివప్రసాద్ విశ్రాంత న్యాయమూర్తులు, తిరుపాలు సహకారం అందించారు. నగర కన్వీనర్ చింతల పల్లె వాసు, నారాయణ, సాయి, ఎస్‌ఎస్‌ఎఫ్‌ ధర్మప్రచారక్ ప్రసాద్, జింక నరేంద్ర, గంగాధర్ పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి