News

వివాదాస్పద ఎమ్మెల్యే ఆజం ఖాన్​పై అనర్హత వేటు!

386views

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​. ఈ మేరకు శాసన సభ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఓ ఐఏఎస్‌ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఇప్పటికే భూఆక్రమణ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ళపాటు జైలు శిక్ష అనుభవించిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం వల్ల విడుదలయ్యారు. అవినీతి, చోరీతో పాటు ఆజంఖాన్‌పై దాదాపు 90 కేసులు ఉన్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి