News

భారత సరిహద్దులకు దగ్గరగా ఎగిరిన పాకిస్థాన్ ఎఫ్ – 16 విమానాలు. సుఖోయ్, మిరేజ్ విమానాలతో బదులిచ్చిన భారత్

905views

పాకిస్థాన్ ఈ వేకువ ఝామున మరో సారి మన సరిహద్దులపై దాడికి యత్నించినట్టుగా సమాచారం. ఈ రోజు వేకువన 3 గంటలకు ఏ గుర్తులూ లేని విమానం (యు.ఏ.వి) ఒకటి, మరో నాలుగు పాకిస్తానీ ఎఫ్ -16 విమానాలు భారత గగనతలంలోకి వచ్చినట్లుగా మన రాడార్లు గుర్తించాయి. వెనువెంటనే ప్రమాదాన్ని ఎదుర్కొనేదానికి మన సైన్యం సుఖోయ్ విమానాలు, మిరేజ్ విమానాలు ఆ దిశగా బయలుదేరాయి. వాటి రాకను గుర్తించిన పాక్ విమానాలు పలాయనం చిత్తగించాయి.

సుఖోయ్

కాగా పుల్వామా ఘటన జరిగినప్పటి నుంచి భారత, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పాక్ మరోసారి మన సైనిక స్థావరాలపై దాడికి యత్నించి ఉండవచ్చని భారత సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అప్రమత్తంగా వున్న భారత రక్షణ దళాలు చురుకుగా స్పందించడంతో పాక్ విమానాలు తోక ముడిచినట్లు తెలుస్తోంది.