News

పాదరక్షల్లో రూ.5 కోట్ల కొకైన్!

409views

ముంబయి: పాదరక్షల్లో కొకైన్​ను అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళను ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె పాదరక్షలలో నుంచి రూ.4.9 కోట్లు విలువ చేసే 490 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అనుమానంతో మహిళను ఎయిర్​పోర్ట్​లో అడ్డగించిన అధికారులు.. అనంతరం పాదరక్షలను తనిఖీ చేశారు. అందులో కొకైన్ ప్యాకెట్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో మహిళను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి