News

జ‌మ్ములో కాల్పులు.ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

691views

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం తెల్లవారుజామున  కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ప‌క్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు కాల్పులకు దిగారు. ఉగ్రవాదులు కూడా పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. హ‌త‌మైన వారి వ‌ద్ద నుంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.