మన ప్రతిపక్షాల పల్లవినే అందుకున్న పాక్ ప్రధాని. A-SAT ప్రయోగంపై ప్రతిపక్షాల విమర్శలపై నెటిజన్ల ఆగ్రహం

పుల్వామా ఘటన. అసువులు బాసిన జవాన్లను చూసి భారతీయులంతా ఎంతగానో చింతించారు. ఆ తర్వాత ఈ పుల్వామా ఘటనకు బాధ్యులను భారత్ మట్టుబెట్టింది. అలాగే ఎంతో మందిని అరెస్ట్ చేసింది. బాలాకోట్ లోని తీవ్రవాదుల స్థావరంపై భారత ఎయిర్ ఫోర్స్ మెరుపుదాడి చేసి వారిని మట్టుబెట్టింది. అయితే ఇదంతా ఒక కుట్ర అని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. అంతెందుకు పవన్ కళ్యాణ్ కూడా ఇలా దాడి జరుగుతుంది అని రెండేళ్ల ముందే తనకు తెలిసింది అని చెప్పుకొచ్చాడు. మోడీ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో వారి గురించే పాక్ మీడియా ప్రముఖంగా ప్రచురిస్తూ వచ్చింది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం పుల్వామా ఘటన కుట్ర అని కొందరు భారత్ కు చెందిన నాయకులు చెప్పిన వ్యాఖ్యలనే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు వల్లె వేస్తున్నారు.
భారత్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతాపరంగా మళ్లీ ఏదో జరగబోతోందనే భయం కలుగుతోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పుల్వామా ఘటన జరిగిన తర్వాత యుద్ధ వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రధాని మోడీ ఉపయోగించుకుంటారని తాను భావించానని.. అనుకున్నట్టే జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసమే ఇదంతా చేస్తున్నారనే విషయాన్ని భారత ప్రజలు గమనించాలని మోడీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు ఇమ్రాన్ ఖాన్. అతి త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే..?
మిషన్ ‘శక్తి’పై కూడా ప్రతిపక్షాల రాజకీయాలు:
ఈ రోజు మన డీఆర్డీఓ శాస్త్రవేత్తలు మిషన్ శక్తి ద్వారా సాధించిన ఘన విజయం పై కూడా ప్రతిపక్షాలు కువిమర్శలు చెయ్యడం దేశప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. “మోడీ మరో అంతులేని డ్రామాకు తెర తీశారు” అంటూ A-SAT ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రకటనను ఎన్నికల స్టంట్ గా కొట్టి పారేశారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇది ఎన్నికల నియమావళిని వుల్లంఘించడమే అని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

అలాగే సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా A-SAT ప్రయోగంపై విమర్శలు గుప్పించగా ఈ ముగ్గురి తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. “దేశ రక్షణ వ్యవహారాల్లోనూ రాజకీయాలా?” అంటూ మండి పడుతున్నారు. అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైన ఘనతను మన శాస్త్రవేత్తలు సాధిస్తే అభినందించాల్సింది పోయి అందులో రాజకీయ కోణాలు వెతుకుతున్న సంకుచిత నాయకులకు రాజకీయాలు తప్ప దేశ హితం పట్టదని విమర్శలు గుప్పిస్తున్నారు.





