News

కేర‌ళ ప్రయాణికుడి కడుపులో కిలో బంగారం!

403views

కొజికోడ్: కేరళ కొజికోడ్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు కిలో బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్​లో నింపి.. కడుపులో దాచుకొని తరలిస్తున్నట్టు గుర్తించారు. మలప్పురం జిల్లా వరియంకోడ్​కు చెందిన నౌఫల్​(36) అనే వ్యక్తి దుబాయ్ నుంచి కొజీకోడ్​కు వచ్చాడు. 1.063 కిలోల‌ బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్‌గా మార్చి కడుపులో పెట్టుకున్నాడు. పోలీసులు అతడిని తనిఖీ చేసినా బంగారాన్ని కనిపెట్టలేకపోయారు. అయినా అనుమానం వచ్చిన అధికారులు.. నిందితుడు నౌఫల్‌ను కొండొట్టిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అతడికి ఎక్స్‌రే తీయగాా కడుపులో ఉన్న నాలుగు బంగారు క్యాప్సూల్స్ బయటపడ్డాయి.

  • కోల్​కతా విమానాశ్రయంలో…

కోల్​కతా విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా సింగపూర్​ నుంచి వచ్చిన ఓ భారతీయ వ్యక్తి నుంచి సుమారు 1,140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 27 బంగారు నాణేలు, మూడు బంగారు కడ్డీలు ఉన్నాయి. వీటి ధర సుమారు రూ.56 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి