
భాగ్యనగరం: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఈ నెల 25 నుంచి జరగనున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను విస్తృతంగా చేస్తున్నారు. వచ్చే నెల మూడోతేదీ వరకు సంబరాలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగను రాష్ట్ర రాజధానితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ మూడోతేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ను ముస్తాబు చేయనున్నారు.
బతుకమ్మ ఘాట్‌తోపాటు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, విద్యుద్దీపాలతో అలంకరించాలని కిందిస్థాయి అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఎల్బీ స్టేడియంతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు.
Source: Nijamtoday