
మామిడాల జగదీశ్ కుమార్, డిల్లీ జవహర్లాల్ నెహ్రు యునివర్సిటీ వైస్ ఛాన్సలర్. పలు రకాల వివాదాలతో, జాతి విద్రోహ శక్తులతో, అస్తవ్యస్తంగా వున్న యూనివర్సిటీ పరిస్థితులను చక్కబెట్టాలనుకోవడం. IIT, డిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కూడా అయిన జగదీశ్ JNU వైస్ ఛాన్సలర్ గా యూనివర్సిటీలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్ధులు పరీక్షలకు హాజరు కావాలంటే కనీస హాజరు వుండాలని, అద్యాపకుల హాజరును గుర్తించడం కోసం బయో మెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టారు. అంతే యూనివర్సిటీలోని అసాంఘిక శక్తులన్నీ ఏకమయ్యాయ్. యూనివర్సిటీ క్యాంపస్లోని వైస్ ఛాన్సలర్ అధికారిక నివాసం వరకు ప్రదర్శన నిర్వహించారు. అదీ ఆయన ఇంట్లో లేని సమయంలో. ఆయన ఇంటికి దూరంగా సమావేశంలో వుండగా వందలాది విద్యార్ధులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు, బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించటానికి ప్రయత్నించారు. ఇంట్లో ఒంటరిగా వున్న వైస్ ఛాన్సలర్ భార్య భయ భ్రాంతులకు గురయ్యారు.

డిల్లీ పోలీసులు కూడా సంఘటనను నిర్ధారించారు. సంఘటన జరిగిన సమయంలో విధుల్లో వున్న సెక్యూరిటీ సిబ్బంది విద్యార్ధులను అడ్డుకున్నారు. కొందరు విద్యార్ధులు తిరుగుముఖం పట్టినా కొందరు మాత్రం అక్కడే బైఠాయించారు. బలవంతంగా ఇంట్లోకి జొరబడ్డానికి యత్నించారు. దీనిపై వైస్ ఛాన్సలర్ జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ విద్యార్ధులను క్షమిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.





