
* నిందితుడు షాహిద్ ఖాన్ అరెస్టు
ఎవరైనా కిడ్నాప్ కి గురైతే దొరకుతారన్న గ్యారంటీ ఉండకపోగా, బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్ కేసుల్లో బాధితులను హతమార్చడం, లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్ లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్ అయిన కూతురుని సినీ ఫక్కీలో గాలించి రక్షించుకున్నాడు.
వివరాల్లోకెళ్తే…. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం….ముంబైలోని సబర్బన్ బాంద్రాలో రోజువారీ కూలీ ఒకతను తన 12 ఏళ్ల కూతురు కిడ్నాప్ కి గరయ్యందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ఆ అమ్మాయి కిడ్నాప్‌కి గురయిన రోజున తల్లికి ఏదో సాకు చెప్పి బయటకు వెళ్లింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి, ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలుపెట్టాడు. ఈ క్రమంలో…. తన కుమార్తె షాహిద్ ఖాన్(24) అనే వ్యక్తితో వెళ్లినట్లు తెలుసుకున్నాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్ర తయారీ సంస్థలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా కూడా తెలుసుకున్నాడు.
నిందితుడు షాహిద్ ఖాన్ కుటుంబం, అలీఘర్ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని… పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకున్నాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్ కి రావాలంటూ ఆహ్వానించి, కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్ కి బస్సులో వెళ్ళారు. అనంతరం రైలులో ఢిల్లీకి వెళ్ళారు. దీంతో పోలీసులు సదరు షాహిద్ ఖాన్ ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.





