
370views
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపు PSLV C54 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగంలో ఓషన్ శాట్-3 ఉపగ్రహంతో పాటు బూటాన్ శాట్, ఆనంద్ అనే మూడు స్వదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహాలతో పాటు వాణిజ్యపరంగా ఏ దేశమైనా ముందుకొస్తే మరో రెండు మూడు ఉపగ్రహాలను పంపించే అవకాశం కూడా ఉంది.





