
388views
హిందువులకు అత్యంత పవిత్రమైన స్వస్థిక్ గుర్తును సంపద, సమృద్ధి, శాంతికి చిహ్నంగా గుర్తిస్తూ అమెరికా లోని అతి పెద్ద రాష్టమైన కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ బిల్ ను పాస్ చేసింది. కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. వారు గత కొంత కాలంగా ఇటువంటి శాసన చర్యను కోరుతున్నారు.
హిందూమతం, బౌద్ధమతం మరియు జైనమతాలకు పవిత్రమైన స్వస్తిక్ ను దాని పవిత్ర చిహ్నంగా గుర్తించిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. గత వారం, మత పెద్దలు మరియు సంస్థల యొక్క ఇంటర్‌ఫెయిత్ సంకీర్ణం కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ మెజారిటీ లీడర్ బాబ్ హెర్ట్జ్ బర్గ్ కు AB 2282 చట్టానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖను సమర్పించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఈ చర్యను స్వాగతించింది.
Source : News 18





