News

బీహార్‌లో విజిలెన్స్ దాడులు… క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా దొరికిన క‌రెన్సీ(వీడియో)

414views

బీహార్: బీహార్‌లో అవినీతి అధికారుల ఇళ్ళ‌పై విజిలెన్స్ అధికారులు శ‌నివారం ఉద‌యం దాడులు చేశారు. అయితే, వారికి దిమ్మ‌దిరిగేలా క‌రెన్సీ దొరికింది. పాట్నాలోని రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్ నివాసంలో దాడులు చేయ‌డంతో పెద్ద మొత్తంలో నగదు ల‌భ్య‌మైంది. రాయ్‌కు చెందిన మొత్తం 3-4 ప్రాంగణాల్లో విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించింది. ప్ర‌స్తుతం క‌రెన్సీలో లెక్కింపు జ‌రుగుతోంది.

Source: ANI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి