
పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ అన్ని విషయాల్లో కట్టడి చేస్తూ వస్తోంది. పాక్ కు భారత్ నుండి కూరగాయలు కూడా పంపడం మానేశాం. ఇప్పుడు పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. వాటిని తెచ్చుకోవడానికి ఇతర దేశాల వంక చూస్తోంది పాకిస్థాన్. ఇప్పుడు కనీసం పచ్చి మిర్చి, టొమాటోలను కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు పాకిస్థాన్ ప్రజలు.
ఇప్పుడు పాక్ లో పచ్చి మిరపకాయలు కేజీ ఎంతో తెలుసా..? 400 రూపాయలు..!
టొమాటో ధర ఏకంగా 200 దాటేసింది.
పుల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్ కు పంపే వస్తువులకు భారత్ ఏకంగా 200 శాతం డ్యూటీ ఛార్జ్ పెరిగిపోయింది. అంతే కాకుండా ఎప్పుడూ పాకిస్థాన్ కు కూరగాయలను పంపే రైతులు కూడా ఆ దేశానికి పంపడం ఆపేశారు. దీంతో పాక్ లో కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకాయి. పాకిస్థాన్ లో గత ఏడాది ఇదే సమయానికి 24 రూపాయలకు టొమాటోలు దొరికేవి.. ఇప్పుడు ఏకంగా 200 రూపాయలు అయ్యాయి. ఇక పచ్చి మిర్చి ధర 2018 లో కేజీ 100 రూపాయల కంటే తక్కువ.. ఇప్పుడేమో ఏకంగా 400 రూపాయలు ఉంది. ఈ ధరలను ఎలా కట్టడి చేయాలా అని పాక్ గవర్నమెంట్ జుట్టు పీక్కొంటోంది.





