News

అబ్బుర పరచిన అబ్దుల్ గఫూర్.

706views

యన పేరు అబ్దుల్ గఫూర్. కుష్ఠు రోగగ్రస్తుడై గత 40సం||ల నుండి రాజమహేంద్రవరంలోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో వుంటున్నారు. వీరికి మొక్కలన్నా, గోవులన్నా మహా ప్రేమ. తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఎక్కువ సమయం మొక్కలు మరియు గోవుల మధ్యే గడుపుతుంటారు. ఆరోగ్య కేంద్రంలో శ్రీ సూర్య నారాయణ మూర్తి ఆలయముంది. ప్రతి ఏడాది రధ సప్తమి రోజున షుమారు 25 – 30  గ్రామాల నుండి వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ వుంటుంది. వదాన్యులు అన్నదానానికి సహకరిస్తుంటారు. గఫూర్ గారి బంధువులు అప్పుడప్పుడు చూసి వెళుతూ పై ఖర్చుల కోసం కొంత సొమ్ము ఆయన చేతికి ఇస్తుంటారు. అలా వచ్చినవి పదివేలైనవి. ఆ మొత్తము ఈ సంవత్సరం రధ సప్తమి రోజున నిర్వహించబడిన అన్న ప్రసాద వితరణకు విరాళంగా ఇచ్చిన వదాన్యులు అబ్దుల్ గఫూర్ ధన్యులు.