News

నుపుర్​ శర్మ వీడియో చూసినందుకు బీహార్‌లో హత్యాయత్నం!

471views

నాన్​పుర్​: బీజేపీ మాజీ నేత నుపుర్​ శర్మకి సంబంధించిన వీడియో చూసినందుకు ఓ యువకుడిపై హత్యాయత్నం జ‌రిగింది. 23 ఏళ్ళ‌ అంకిత్​ ఝా అనే వ్యక్తిపై మరో వర్గానికి చెందిన నలుగురు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన బీహార్‌లోని సితామర్హీ జిల్లా నాన్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అంకిత్​ ఓ పాన్​ షాప్​ దగ్గర వాట్సాప్​ చూస్తుండగా నిందితులు అతని వద్దకు వచ్చి గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారు అతనిపై దాడి చేసి పరారయ్యారు. స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంకిత్​ చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈ ఘటనకు మతపరమైన ఘర్షణలతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, ఈ హత్యాయత్నానికి, నుపుర్​ శర్మ వివాదానికి సంబంధం ఉందంటున్నారు బాధితుడి కుటుంబసభ్యులు. ఘటన జరిగిన సమయంలో బాధితుడు నుపుర్​ శర్మ వివాదానికి సంబంధించిన వీడియో చూస్తున్నాడని అందుకే ఓ వర్గానికి చెందిన నిందితులు అతని దాడి చేశారన్నారు.

కానీ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసే సమయంలో ఆ పేరును ఫిర్యాదులో ప్రస్తావనకు తీసుకురాకూడదని.. అలానే ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తామని పోలీసులు బలవంతం చేసినట్టు ఆరోపించారు. కానీ అంకిత్​ కుటుంబసభ్యుల ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఈ ఘటనకు, మతఘర్షణలకు ఎలాంటి సంబంధం లేదని.. పరారీ ఉన్న నలుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్​ చేసినట్టు సితామర్హీ ఎస్​పీ తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి