సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు దశల్లో ఎన్నికలు. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య, రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే దశలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే
ఫేజ్ వన్ (11/4/2019) (రాష్ట్రం, నియోజకవర్గాల సంఖ్య):
ఏపీ 25, అరుణా చల్ ప్రదేశ్ 2, అసోం 5, బీహార్ 4, చత్తీస్ గఢ్ 1, జమ్ముకశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, ఒడిశా 4, సిక్కిం 1, తెలంగాణ 17, త్రిపుర 1, యూపీ 8, ఉత్తరాఖండ్ 5, పశ్చిమబెంగాల్ 2, అండమాన్ నికోబార్ 1, లక్షద్వీప్ 1. మొత్తం 91 నియోజకవర్గాలు, 20 రాష్ట్రాలు.
ఫేజ్ టూ (18/4/2019):
అసోం 5, చత్తీస్ గఢ్ 3, బీహార్ 5, జమ్ముకశ్మీర్ 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, మణిపూర్ 1, ఒడిశా 5, తమిళనాడు 39, త్రిపుర 1, యూపీ 8, పశ్చిమబెంగాల్ 3, పుదుచ్చేరి 1. మొత్తం 97 నియోజకవర్గాలు, 13 రాష్ట్రాలు.
మూడో ఫేజ్ (23/4/2019):
అసోం 4, బిహార్ 5, చత్తీస్ గఢ్ 7, గుజరాత్ 26, గోవా 2, జమ్ముకశ్మీర్ 1, కర్ణాటక 14, కేరళ 20, మహారాష్ట్ర 14, ఒడిశా 6, యూపీ 10, పశ్చిమబెంగాల్ 5, దాద్రా మరియు నగర్ హవేలీ 1, డమన్ మరియు డయూ 1. మొత్తం నియోజకవర్గాలు 115, రాష్ట్రాలు 14.
నాలుగో ఫేజ్ (29/4/2019):
బీహార్ 5, జమ్ముకశ్మీర్ 1, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 17, ఒడిశా 6, రాజస్థాన్ 13, యూపీ 13, పశ్చిమబెంగాల్ 8. మొత్తం నియోజకవర్గాలు 71, రాష్ట్రాలు 9.
ఐదో ఫేజ్ ( 6/5/2019):
బీహార్ 5, జమ్ముకశ్మీర్ 2, జార్ఖండ్4, మధ్యప్రదేశ్ 7, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమబెంగాల్ 7. మొత్తం నియోజకవర్గాలు 51, రాష్ట్రాలు 7
ఆరో ఫేజ్(12/5/2019):
బీహార్ 8, హర్యానా 10, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 8, ఉత్తర ప్రదేశ్ 14, వెస్ట్ బెంగాల్ 8, ఢిల్లీ – NCR 7. మొత్తం నియోజకవర్గాలు 59, రాష్ట్రాలు 7.
ఏడో ఫేజ్ (19/5/2019):
బిహార్ 8, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, చండీగఢ్ 1, ఉత్తరప్రదేశ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4. మొత్తం నియోజకవర్గాలు 59, రాష్ట్రాలు 8.







