News

యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి!

194views

వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్‌ను ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌కు సాంకేతిక పరీక్ష నిర్వహించారు. వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ముఖ్యమంత్రి మళ్లీ సర్క్యూట్ హౌస్‌కు వచ్చారని ప్రాథమిక సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వ విమానంలో ఆయన లక్నోకు బయలుదేరారు. “వారణాసి నుంచి లక్నోకు బయలుదేరిన తర్వాత సీఎం హెలికాప్టర్‌ను ఒక పక్షి ఢీకొట్టింది, ఆ తర్వాత అది ఇక్కడ దిగాల్సి వచ్చింది” అని జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి