
318views
చిత్తూరుజిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో చిత్రా పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలో మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. స్వామిని సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ పుష్కరిణి వద్ద హారతులు ఇచ్చారు. వేడుకలను తిలకించడానికి వందలాదిగా భక్తులు కాణిపాకం విచ్చేశారు. అనంతరం సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాకం పుర వీధులలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఐరాలకు చెందిన దివంగత రామకృష్ణపిళ్లై కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఇన్‌స్పెక్టర్లు రమేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.





