
సేవబారతి, నెల్లూరు అధ్వర్యంలో నెల్లూరులోని కోటమిట్టనందు గల శ్రీ కృష్ణదేవరాయ సెంటర్ వద్ద గల మహిళల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో12 వ బ్యాచ్ వారికి సర్టిఫికేట్ ప్రదానోత్సవం
జరిగింది. ఈకార్యక్రమంలో ప్రముఖ బంగారు వ్యాపార వేత్త శ్రీ రామకృష్ణ, సర్వోదయ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ సురేష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రధాన వక్త శ్రీ సావార్కర్ మాట్లాడుతూ భారతీయ సమాజంలో తల్లిగా, చెల్లిగా, వదినగా, అమ్మమ్మగా, నానమ్మగా తమ పిల్లల్ని ప్రయోజకులుగా చేయడంలోనూ, కుటుంబాన్ని సరియైన దిశలో నడపడంలోనూ మహిళలదే ప్రధాన పాత్ర అని తెలిపారు. ఏమీ ఆశించకుండా యావజ్జీవితాన్ని కుటుంబ సంరక్షణ, శ్రేయస్సు కోసం వెచ్చించే మాతృ మూర్తులు మనకందరికీ పూజ్యనీయులని శ్రీ సావార్కర్ పేర్కొన్నారు. మహిళలు సామాజిక, ఆర్ధిక స్వావలంబన సాధించటానికి కుట్టు మిషన్ శిక్షణ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని, అందుకే సేవాభారతి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక మంది మహిళలకు కుట్టు మిషన్లలో ఉచిత శిక్షణ ఇస్తోందని తెలిపారు. అవకాశమున్న మహిళలు దీనిని సద్వినియోగం చేసుకుంటే వారికి ఆర్ధికంగా భరోసా లభిస్తుందని తెలిపారు.

ఈకార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం మహిళలు కోలాటం,ఆటలు, పాటలు ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో స్థానిక మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






