News

కన్హయ్య కుమార్ వ్యాఖ్యలపై బీహార్ భాజపా నాయకుడు కోర్టుకు.

231views

కిషన్ గంజ్, బీహార్ : జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ (JNUSU) మాజీ విద్యార్ధి యూనియన్ నాయకుడు కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీహార్ కు చెందిన BJP నాయకుడు టిటు బద్వాల్ మార్చ్ 6న కోర్టులో కేసు దాఖలు చేశారు. మార్చ్ 4న కిషన్ గంజ్ లోని అంజుమన్ ఇస్లామియా హాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్ర మోడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీహార్ BJP మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు టిటు బద్వాల్ ఆరోపిస్తున్నారు.

పవిత్రమైన మసీదు ప్రాంగణాన్ని కన్హయ్య కుమార్ రాజకీయాలకు ఉపయోగించారని, ప్రధానిని అభ్యంతరకరమైన, అవమానకరమైన భాషలో దూషించారని శ్రీ బద్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమం CPI అధ్వర్యంలో జరిగింది. గుజరాత్ లోని వేద్గం అసెంబ్లీ నియోజకవర్గం MLA జిగ్నేష్ మేవాని కూడా ఆ కార్యక్రమంలో వుండడం గమనార్హం.

“కన్హయ్య కుమార్ లాంటి వ్యక్తులను వెనకేసుకొచ్చే, ప్రోత్సహించే జిగ్నేష్ మేవాని లాంటి వ్యక్తులను కూడా బీహార్ లో అడుగుపెట్టనివ్వమని బద్వాల్ హెచ్చరించారు. కాగా కన్హయ్య కుమార్ రాబోయే ఎన్నికలలో బీహార్లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి CPI అభ్యర్ధిగా పోటీ చేయనుండడం గమనార్హం.