News

కర్నూలులో చర్మకారులకు సన్మానం

1.3kviews

ర్నూలు జిల్లా కర్నూలు నగరంలో 03.03.19 న ఆరెస్సెస్ నగర విస్తృత సాంఘిక్ జరిగింది.ఈ సాంఘిక్ లో క్షేత్ర ప్రచారక్ మాన్యశ్రీ శ్యామ్ కుమార్ పాల్గొని మార్గదర్శనం చేశారు. “ఆరెస్సెస్ సమాజాన్ని జాగృతం చేసే పని చేస్తోంది” అని శ్రీ శ్యాం కుమార్ చెప్పారు.ఈ సాంఘిక్ లో నగరంలోని 63 బస్తీలకు గాను 57 బస్తీల నుంచి స్వయంసేవకులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక సమరసతా వేదిక కర్నూలు ఆధ్వర్యంలో  చర్మకార బంధువులకు సన్మాన కార్యక్రమం జరిగింది. చర్మకారుడు శ్రీ పగిడిరాయి పాలరాముడుని ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ సన్మానించారు.