News

భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం

195views

చైనాను వెనక్కినెట్టి భారత కీలక వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2021-22లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్ డాలర్లుకు చేరింది. 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020-21లో భారత్ నుంచి అమెరికాకు 76.11 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా.. 43.31 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. అదే చైనా – భారత్ ల ద్వైపాక్షిక వాణిజ్య విలువ సుమారు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ మేరకు చూసుకుంటే భారత్ చైనాతో కంటే అమెరికాతోనే ఎక్కువగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని జరిపింది. అయితే భవిష్యత్తులో 2 దేశాల వాణిజ్య బంధం మరింత బలపడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.