
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత యాసిన్ మాలిక్‌కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదీతో పాటు రూ.10వేలు జరిమానా విధించింది. అంతకుముందు మరణ శిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ డిమాండ్ చేసింది.
2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంతోపాటు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించిన కేసుల్లో యాసిన్ మాలిక్‌ను దోషిగా ఢిల్లీ కోర్టు గత వారం నిర్ధారించింది. శిక్షలపై బుధవారం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో యాసిన్ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరింది.
ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్‌కు విన్నవించింది. యాసిన్ మాలిక్ తరుఫున వాదించేందుకు కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, ఆయనకు జీవిత ఖైదు విధించాలని సూచించింది. అయితే, తనపై ఎన్‌ఐఏ చేసిన ఆరోపణలను యాసిన్ మాలిక్ తోసిపుచ్చారు.
Source: NationalistHub





