
746views
మార్చి 2 వతేది ప్రకాశం జిల్లా మద్దిపాడు లో సంచారజాతుల ఆత్మీయ సదస్సు జరిగింది. ముఖ్య వక్తగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యనారాయణ , విభాగ్ సంపర్క ప్రముఖ్ శ్రీ తడికమల్ల హరిప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ కోడూరు సత్యం మాట్లాడుతూ మారుతున్న కాలము, పరిస్థితులకు అనుగుణంగా సంచార జాతుల వారు మారాల్సిన అవసరమున్నదని అభిప్రాయ పడ్డారు. మారిన వాతావరణ పరిస్థుతులలో సంచార జాతుల వారు ఎక్కడైనా తలదాచుకోవడం అసంభవమన్నారు. నగరీకరణ, అపరిశుభ్ర వాతావరణం కారణంగా పెరిగిన దోమల బెడద వారిని వేధిస్తుందని తెలిపారు. ఇదే కాక మిగిలిన సమాజం యొక్క అనుమానపు చూపులు, పోలీసుల వేధింపులు వారి స్వచ్చా జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం సంచార జాతులకు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను సక్రమంగా ఉపయోగించుకుంటే అభివృద్ధి సాధించ వచ్చని శ్రీ సత్యం తెలిపారు. ప్రభుత్వాలు కూడా సంచార జాతుల బాగోగులపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదని శ్రీ సత్యం అభిప్రాయపడ్డారు.






