
42views
బెంగళూరు: మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కర్ణాటక కేబినెట్ మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించిందని, అప్పటి వరకు ఆర్డినెన్స్ అమలులో ఉంటుందని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని రాష్ట్ర హోంమంత్రి అన్నారు. కేబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమ ప్రభుత్వం ఈ చర్యను అమలు చేయబోతోందని చెప్పారు. ఈ బిల్లుకు జీవం పోసేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని లా డిపార్ట్‌మెంట్ తన అభిప్రాయాన్ని తెలిపిందని విశ్వసనీయ సమాచారం. కాగా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అంతకుముందు రోజు అధికార బొమ్మై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.