News

“సక్షమ్” ఆద్వర్యంలో “హైపటైటిస్-బి” వ్యాక్సిన్ ఉచిత పంపిణీ 

760views
(27.02.2019) బుధవారం
క్షమ్ (సమదృష్టి,క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) మరియు విశ్వభారతి స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆద్వర్యంలో గుండెమడకల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ దాదాపు 246 మందికి “హైపటైటిస్-బి” వ్యాక్సిన్  ను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సక్షమ్ అఖిల భారత స్థాయిలో దివ్యాoగుల సర్వతోముఖాభివృద్ధికి మాత్రమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నదని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ సక్షమ్ దివ్యాoగుల సంక్షేమం కోసం, అంధత్వ నిర్మూలన కోసం, రక్తదాన అవగాహన కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి సేవా సంస్థ అద్యక్షుడు నర్రావుల పుల్లారెడ్డి, సక్షమ్ వింజమూరు కన్వీనర్ పీవీ క్రిష్ణారెడ్డి, వైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు, గోపి మరియు పాఠశాల అధ్యాపకులందరూ పాల్గొన్నారు.