News

మాతృభూమి కోసం మాతృమూర్తి త్యాగం

454views

* వైరలవుతున్న సైనికుడి తల్లి చిత్రం

* భావోద్వేగానికి లోనవుతున్న జనం

దేశసేవ చేసే అవకాశం దక్కడం ఎంత అదృష్టమో.. అంతే దినదిన ప్రాణగండం కూడా. అలా ఓ సైనికుడి తల్లి తన కుమారుడు సరిహద్దులో దేశాన్ని కాచే ఉద్యోగంలో చేరినందుకు ఆనందపడింది. నచ్చిన ఉద్యోగంలో చేరినందుకు సంతోషించింది. కానీ, ఆ బిడ్డ విధులకు వెళ్తుంటే మాత్రం తల్లడిల్లిపోయింది. తిరిగి వస్తాడో లేదో తెలియని సందిగ్ధంతోనే నవ్వుతూ వీడ్కోలు పలికి, తలుపు మాటున కన్నీటి పర్యంతమైంది. లెఫ్టినెంట్ జనరల్‌ సతీశ్‌ దువా షేర్‌ చేసిన చిత్రంలో సరిగ్గా ఇదే భావన స్ఫురిస్తోంది.

’30 ఏళ్ల క్రితం నేను నా తల్లిని కోల్పోయాను. ప్రతి సైనికుడి తల్లిలో తనను చూసుకుంటున్నాను. నా మాతృభూమి స్పర్శలో తనను స్మరించుకుంటున్నాను. అమ్మా నీకు వందనం’ అంటూ ఆయన ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ‘త్యాగానికి ఇంతకు మించిన అర్థం ఉంటుందా..?’, ‘హృదయం ద్రవిస్తోంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.