
* నిందితుడు సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నీలోత్పల్ మృణాల్ పై కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటూ UPSCకి ప్రిపేర్ అవుతున్న ఓ మహిళ(32)పై పెళ్లి ముసుగులో పదేళ్లపాటు అత్యాచారం చేశారన్న ఆరోపణలతో మృణాల్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం, మహిళ 2013లో నిందితుడిని కలుసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి మధ్య స్నేహం పెరిగింది. డాన్ని ఆధారంగా చేసుకుని నీలోత్పల్ ఆమెపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమెను తరచుగా లైంగికంగా వాడుకున్నాడు. పెళ్లి విషయం ఎనిసార్లడిగినా వాయిదా వేస్తూ వచ్చాడు. అతనికి అనేకమంది ఇతర మహిళలతో కూడా సంబంధాలున్నాయనే విషయం కొన్నాళ్ళకు బాధిత మహిళకు అర్థమైంది.
బాధితురాలు తిమార్పూర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 6న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారం చేసినందుకు, బాధ కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ల కింద ఉత్తర ఢిల్లీలో రచయితపై ఎఫ్ఐఆర్ నమోదైంది.





