News

ద్వారకా తిరుమల ఆలయంలో భక్తుల విరాళం హాం ఫట్

430views

* కాజేసిన ఆలయ మహిళా ఉద్యోగి

* విధుల్లోంచి తొలగించిన ద్వారకా తిరుమల దేవస్థానం

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మహిళా ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. గత నెలలో డొనేషన్ కౌంటర్ వద్ద నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు రూ.1116 చెల్లించారు. అయితే అతనికి మహిళ ఉద్యోగి రూ.216 రసీదు ప్రింట్ చేసి పెన్నుతో సరిచేసి ఇచ్చింది. నిత్యాన్నదాన భవనం వద్ద రసీదుపై కొట్టివేతలు ఉండడంతో సిబ్బంది ఆన్‌లైన్‌లో పరిశీలించారు. రూ.216 చెల్లించినట్లు ఉండడంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.