సంఘ “కార్యకర్తల నిఘంటువు” స్వర్గీయ డాక్టర్ దెందుకూరి శివప్రసాద్ – పుస్తకావిష్కరణ సభలో శ్లాఘించిన వక్తలు.

కీ.శే.మాననీయ శ్రీ దెందుకూరి శివప్రసాద్ గారు ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత పూర్వ సంఘచాలకులు. వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్టణంలో వారి జీవిత విశేషాలతో కూడిన “ కార్యకర్తల నిఘంటువు” పుస్తకావిష్కరణ సభ జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత సహ సర్ కార్యవాహ మాననీయ శ్రీ భాగయ్య గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి పుస్తక ఆవిష్కరణ చేశారు . మాననీయ శ్రీ శివప్రసాద్ గారి జీవిత విశేషాలను శ్రీ భాగయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పరివార్ క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు. మన క్షేత్ర ప్రచారకులు శ్రీ శ్యాం జి, క్షేత్ర కార్యవాహ శ్రీ దూసిరామకృష్ణ గారు, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి శ్రీ రాఘవులు గారు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ శివ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు కచేరితో ప్రారంభించారు. వేదికపై స్వర్గీయ శివప్రసాద్ గారి పెద్ద కుమారుడు శ్రీ రామ కృష్ణ గారు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా|| విజయగోపాల్ గారు ఆశీనులయ్యారు. స్వర్గీయ శివప్రసాద్ గారి రెండవ కుమారుడు శ్రీ సూర్య నారాయణ మూర్తి గారు వందన సమర్పణ గావించారు. శ్రీ ఏడిద రామన్ గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.





