
ఫిబ్రవరి18, ఉదయం 11 గంటలు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తెనాలి ..ఒక 13 ఏళ్ల బుడ్డోడు స్టేషన్ లోకి వచ్చాడు అక్కడున్న అధికారి వీడ్ని పట్టించుకోకుండా ఆయన పనిలో ఆయన మునిగిపోయాడు..
సార్..నాకు పర్మిషన్ & సెక్యూరిటీ కావాలి అడిగాడు ఈ బుడ్డోడు.. ముందు ఆ అధికారికి అర్ధం కాలా..”దేనికి సెక్యూరిటీ కావాలిరా?” అని అడిగారు..
“19 వ తారీఖు శివాజీ మహరాజ్ జయంతి. మా స్కూల్ పిల్లలం ఊరేగింపుగా వచ్చి శివాజీ మహరాజ్ విగ్రహానికి దండ వేస్తాం. దానికి పర్మిషన్ కావాలి…”
ఆ అధికారికి విషయం అర్ధం అయింది..వీడు మామూలోడు కాదు మొత్తానికి వీడి దగ్గర సరుకుంది అని. స్థానిక ఆరెస్సెస్ నాయకుడు శ్రీ అవ్వారు శ్రీనివాస రావు దగ్గరకు పిల్లాణ్ణి పంపారు..
వీడు ఆయన దగ్గరకు వెళ్ళడమే ‘ అంకుల్ మీరు లెటర్ రాసిస్తే మా ఊరేగింపుకు పెర్మిషన్ ఇస్తారట ‘ వెంటనే రాసివ్వండి అని డిమాండ్…
వాడితో అరగంట మాట్లాడితే అర్ధం అయింది శ్రీనివాస రావు గారికి వీడు ఛత్రపతి అంశలో పుట్టాడని…
వాడి పేరు కూడా శివాజీ మహరాజ్ అంత గంభీరమైనదే.. ‘ సమర్థ్’…7 వ తరగతి చదువుతున్నాడు..
రేపు సాయంత్రం 4 గంటలకు సమర్థ్ నాయకత్వంలో శివాజీ మహరాజ్ జయంతి జరుపబోతున్నాం అని స్థానిక హిందూ సంస్థల కార్యకర్తలందరికీ కబురంపారు శ్రీనివాస రావు గారు.
అనుకున్నట్టుగానే పాఠశాల బాల బాలికలు, స్థానిక హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొనగా అంగ రంగ వైభవంగా శివాజీ జయంతి ర్యాలీ, అనంతరం సభా కార్యక్రమం జరిగాయి. ఆ దృశ్యాలివిగోండి మీ కోసం.












