News

ఢిల్లీలోని కుతుబ్ మినార్ విష్ణు ధ్వజమే…

536views
  • హిందూ పూజలకు అనుమతించాలి

  • విశ్వహిందూ పరిషత్ డిమాండ్

న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం కుతుబ్‌మినార్‌‌పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి వినోద్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రసిద్ధ స్మారక చిహ్నం కుతుబ్‌మినార్‌ నిజానికి విష్ణు స్తంభం అని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. 27 హిందూ-జైన్ దేవాలయాలను కూల్చివేసిన తర్వాత లభించిన వస్తువులతో స్మారక చిహ్నాన్ని నిర్మించినట్టు బన్సాల్ ఆరోపించారు.

కేవలం హిందూ సమాజాన్ని ఆటపట్టించేందుకే సూపర్‌ఇంపోజ్డ్ నిర్మించారని బన్సాల్ పేర్కొన్నారు. గతంలో కూల్చివేసిన మొత్తం 27 ఆలయాలను మళ్లీ పునర్ నిర్మించాలని వీహెచ్‌పీ నేత డిమాండ్ చేశారు.‘‘గతంలో ఈ ప్రదేశంలో కూల్చివేసిన మొత్తం 27 దేవాలయాలను పునర్నిర్మించాలని, హిందువులు ప్రార్థనలు చేయడానికి అనుమతించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని బన్సాల్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి