News

ఆలయాల సమీపంలో ఉన్న దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే అమ్మాలి – దేవాదాయ శాఖ ఆదేశాలు

493views

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల సమీపంలో ఉన్న దుకాణాల్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి వస్తువు ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రతి దేవస్థానంలో విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని కమిషనర్ హరి జవహర్ లాల్ ఆదేశించారు. కొబ్బరి కాయలు, పూలు, తినుబండారాల రేట్లను ఈవోలు దుకాణాదారులతో చర్చించి, నిర్ణయించాలని ఆయన సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.