News

హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం!

942views
  • హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ

భాగ్య‌న‌గ‌రంః హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధ్రువీకరించడం ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా మారడానికి మార్గం అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ ఒక వీడియోలో తెలిపారు. ఈ డబ్బు దేశానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తంలో దేశ వ్యతిరేక కుట్రలకు నిధులు సమకూరుస్తుందని గౌడ వాదించారు.

“హలాల్ మాంసం, హలాల్ ఉత్పత్తులను బహిష్కరించాలని, హిందూ వధ పద్ధతిని ఉపయోగించే ఝట్కా విధానాన్ని ఉపయోగించాలని మేము హిందువులందరినీ కోరుతున్నాము. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆర్థిక బహిష్కరణలో భాగస్వాములు అవుదాం’’ అని మోహన్ గౌడ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో కోరారు.

ఇస్లాం మతానికి సంబంధించిన పద్ధతులను ఉపయోగించి చేసిన హలాల్ మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించడం సరైనది కాదని హిందూ జనజాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌మాత్ న్యూస్‌తో గౌడ మాట్లాడుతూ, “పలు సందర్భాల్లో హిందువులు మాంసం పెద్ద మొత్తంలో తీసుకువస్తారు. ఇస్లాం ప్రకారం హలాల్ ధృవీకరించబడిన మాంసాన్ని బహిష్కరించాలని మేము ప్రచారం చేసాము.. చేస్తున్నాం.
ఎందుకంటే ఇస్లాం ప్రకారం ఇది మొదట అల్లాకు సమర్పించబడుతుంది.

అలాంటి మాంసాన్ని హిందూ దేవుళ్లకు, దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదు” అని వివరించారు. “ఒక ముస్లిం మనిషి ఏదైనా జంతువును చంపినప్పుడు, దానిని మక్కా వైపు చూపిస్తాడు. దానిని చంపేటప్పుడు నమాజ్ చేస్తారు. అటువంటి జంతువుల మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించకూడదు. హిందూమతంలో, జంతువులను వేధించకూడదని మేము విశ్వసిస్తాము” అని అన్నారు.

ఇక చాలా మంది హిందూ కార్యకర్తలు, సంస్థలు ఆహార ఉత్పత్తులపై హలాల్ ధ్రువీక‌ర‌ణ‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2021లో తుషార కేరళలో తొలిసారిగా హలాల్ లేని రెస్టారెంట్‌ను ప్రారంభించింది, ఆమె బ్రాంచ్ తెరవగానే ఇస్లామిక్ గూండాలు ఆమెపై దాడి చేసి బెదిరించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో, హలాల్ లేని మాంసాన్ని విక్రయిస్తున్నందుకు కేరళకు చెందిన క్రైస్తవ వ్యక్తిపై దాడి చేశారు. అతని ఫుడ్ ట్రక్ ఈ సంఘటనలో దగ్ధమైంది అని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి