
భారత మీడియా పాక్ చేతిలో పావుగా మారిందా? అందుకే హైందవేతరులు, దళితులపై జరిగే దాడులను గోరంతలు కొండంతలుగా చూపిస్తోందా? సైనికులు, హిందువుల ప్రాణాలు పోతున్నా లైట్ తీసుకుంటోందా? ఇప్పుడు తాజాగా వెల్లడైన 2016 పాకిస్థాన్ సెనేట్ మీటింగ్ యొక్క వివరాలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది.
పొరుగు దేశం పాకిస్థాన్ మన దేశంలో ప్రస్తుత ప్రభుత్వాన్నిఅస్థిరపరచటానికి తెలివిగా ఒక సరికొత్త పథకాన్ని రచించింది.
దేశంలో ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే మన దేశంలోని సెక్యులర్ మీడియా ఆ ఘటనను పెద్దదిగా చేసి చూపిస్తోంది. దళితులు, ముస్లింలు మరియు క్రైస్తవుల పైన ఏదైనా ఒక చిన్న దుర్ఘటన జరిగితే వెంటనే దానిని ఆ వర్గాల మీద అత్యాచారాలుగా చూపిస్తూ గగ్గోలు పెడుతోంది. దర్యాప్తుకు ముందే కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తూ నానా హంగామా సృష్టిస్తోంది. అందుకు కారణం ఏమిటో తెలుసా? పాకిస్థాన్ కుట్ర. అవును మీరు చదివింది నిజమే. మన మీడియా పాకిస్థాన్ చేతిలో కీలు బొమ్మగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్థాన్ యొక్క మాస్టర్ ప్లాన్ 2016 దాగివుంది.
ఉదాహరణకు కులభూషణ్ వ్యవహారమే తీసుకుంటే హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతీయుడైన కులభూషణ్ యాదవ్ కేసు విచారణ జరుగుతోంది. కులభూషణ్ తమ దేశంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్న పాకిస్థాన్ అతనికి ఉరి శిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ భారత్ దాఖలు చేసిన అప్పీల్ పై న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే కులభూషణ్ పై నేరారోపణ చేసేందుకు వీలుగా భారతీయ మీడియాలోనే కధనాలు సృష్టించింది పాక్. 2017లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కరణ్ థాపర్ వ్రాసిన వ్యాసం, 2018లో ప్రవీణ్ శర్మ ఫ్రంట్ లైన్ కధనం, క్వింట్ లో చందన్ నంది కధనాలను ఇప్పుడు సాక్ష్యంగా చూపిస్తోంది పాకిస్థాన్. పాకిస్థాన్ కుట్రలో ఇది కూడా ఒక భాగం.
పాకిస్థాన్ 2016 కుట్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీనిని 2016లో పాకిస్థాన్ ఎగువ సభకు చెందిన కమిటీ ఒకటి రచించింది. విధాన మార్గదర్శక ప్రణాళిక తయారీలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్, రక్షణ కార్యదర్శి, ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ తో పాటు 13మంది ఎంపి లు పాల్గొన్నారు. దీనిని 4 అక్టోబర్ , 2016లో ఆమోదించారు.
పాకిస్థాన్ పట్ల కఠినమైన వైఖరి అవలంబిస్తున్న మోదీని తొలగించడానికి లేదా ఎదుర్కోవడానికి అమలుచేయాల్సిన 22 సూత్రాల ప్రణాళికను ఈ కమిటీ తయారుచేసింది. కాశ్మీర్ విషయమై భారత్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై ప్రచారం సాగించడం కోసం అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందంటూ పదేపదే ఆరోపణలు చేయాలని ఆ కమిటీ సూచించింది.
ఈ ప్రణాళిక చాలా ప్రమాదకరమైనది. సమాజంలో విభేదాలు సృష్టించడం ఇందులో ప్రధాన అంశం. అంటే జాతి, మతం మొదలైనవాటి ఆధారంగా ఘర్షణలు సృష్టించడం. హిందూత్వం, ఆర్.ఎస్.ఎస్ పేరు చెప్పి క్రైస్తవులు, ముస్లిములు, దళితుల్లో భయాందోళనలు కలిగించడం. దీని కోసం మోదీ వ్యతిరేక మీడియా, మానవహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలన్నది ఆ ప్రణాళికలో భాగం.
ఈ ప్రణాళికను పాకిస్థాన్ ఇప్పటికే అమలులో పెట్టినట్లు కనిపిస్తోంది. క్రైస్తవులు, ముస్లింలు, దళితుల పై దాడులు జరిపి, అవన్నీ మోదీ ప్రభుత్వం వల్లనే జరుగుతున్నాయని చిత్రీకరించే ప్రయత్నం ఇప్పటికే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వర్గాలలో హిందూత్వం, ఆర్ ఎస్ ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఏదో చిన్న సంఘటనను ఆధారం చేసుకుని మీడియా, మేధావి వర్గం, కొన్ని పార్టీలు హిందూత్వం, ఆర్ ఎస్ ఎస్ కు వ్యతిరేకంగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాయో ఇప్పుడు అర్ధమవుతుంది. తన కుట్రపూరిత ప్రణాళికను అమలులో పెట్టే పనిని పాకిస్థాన్ అంతర్జాతీయ సంస్థలకు అప్పగించింది. అలా ఏ సంస్థల ద్వారా పని జరిపించాలన్నది కూడా ఎంపీ కమిటీ నిర్ధారించింది.
పాకిస్థాన్ సెనేట్ కమిటీ రిపోర్ట్ ప్రకారం సాగుతున్న ఈ కుట్ర వివరాలు ఇప్పుడు క్రమంగా సామాన్య ప్రజానీకానికి కూడా అర్ధమవుతున్నాయి. దేశంలో చిన్నచిన్న కారణాలకే పెద్ద ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుస్తోంది. ఎవరి కోసం దేశంలో కొందరు ఈ ఆందోళనలు చేస్తున్నారో స్పష్టమవుతోంది.
జైపూర్లో నాటక సమాజాల ప్రదర్శనల ద్వారా సైన్యంపై వ్యతిరేక సందేశం – బడమేర్ లో అమరవీరుల స్మారకాలపై అసాంఘిక శక్తుల దాడి :
జైపూర్/బడమేర్: పుల్వామాలో జరిగిన సైనిక బలిదానానికి దేశం మొత్తం శోక సముద్రంలో మునిగి వీరసైనిక కుటుంబాలకు అండగావుండి, హృదయపూర్వకంగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంటే మరోవైపు కొన్ని అసాంఘిక శక్తులు,సంఘ విద్రోహ శక్తులు దేశంలో అరాచకత్వాన్ని సృష్టించాటానికి యధాశక్తి కృషి చేస్తున్నాయి. జైపూర్లో కొన్ని అసాంఘిక శక్తులు నాటక ప్రదర్శనల ద్వారా కాశ్మీర్ సైన్యం యెక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు బడమేర్లో చీకటి రాత్రులలో అమరవీరుల స్మృతి చిహ్నాలను ద్వంసం చేస్తూ కొన్ని వికృత శక్తులు రాక్షసానందాన్ని పొందుతూ అమర వీరుల్ని అవమానిస్తున్నాయి. ఇవన్నీ కేవలం సమాజంలో అస్థిరతను సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు. అంతే కాకుండా జరుగుతున్న పరిణామాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన మీడియా మరింత అయోమయానికి గురిచేసేలా కధనాలను వెలువరిస్తూ వుండడం ఎంత మాత్రమూ అభిలషణీయం కాదు.
Key Highlights of Pakistan senate report

Click here to view Publication





