
వింజమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆరెస్సెస్ ద్వితీయ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ శ్రీ మాధవరావు సదాశివరావు గోళ్వాల్కర్ (శ్రీ గురూజీ) ని స్మరించుకుంటూ సక్షమ్ అఖిల భారత స్థాయిలో నేత్రదాన వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ రోజు సక్షమ్ వింజమూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో గురూజీ జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా నేత్రదాన వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా సక్షమ్ నెల్లూరు జిల్లా సహ కార్యదర్శి మరియు కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి , ముఖ్య అతిథులుగా వింజమూరు ఖండ కార్యవాహ శ్రీ వీరంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి , సక్షమ్ వింజమూరు కన్వీనర్ శ్రీ పివి క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రధాన వక్త శ్రీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ గొప్ప దార్శనికులని, హిందూ సమాజంలో నెలకొన్న అనైక్యత, అంటరానితనం వంటి లోపాలను సరిదిద్దడానికి సకారాత్మక దిశలో కృషి చేశారని తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత సంక్షోభ సమయం నడుస్తున్నప్పుడు ప.పూ. శ్రీ గురూజీ సంఘానికి నేతృత్వం వహించారని, 33 సంవత్సరాల పాటు వారి సమర్ధ నేతృత్వంలో సంఘం దిన దిన ప్రవర్ధమానమైందని తెలిపారు.
శ్రీ గురూజీ దేశ విభజన, గాంధీజీ హత్య, రెండు సార్లు పాకిస్థాన్ యుద్ధం, చైనా యుద్ధం వంటి అనేక సంక్షుభిత సమయాల్లో దేశ నాయకత్వానికి, ప్రజలకు, హిందూ సమాజానికి, స్వయంసేవకులకు సరియైన మార్గదర్శనం చేశారని తెలిపారు.
ఈ జయంతి వేడుకలలో మొత్తం 95 మంది పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కలిగిరి ఖండ శారీరక ప్రముఖ్ శ్రీ చల్లా గోపి , వింజమూరు నగర కార్యవాహ శ్రీ చలమయ్య , జాగృతి జిల్లా ప్రచార ప్రముఖ శ్రీ నర్రావుల పుల్లారెడ్డి, SSF జిల్లా కన్వీనర్ శ్రీ గుణ్ణం మాధవ రెడ్డి , బిజెపి నాయకులుశ్రీ చుండి హరిగోపాల్ రెడ్డి , శ్రీ మద్దూరి నాగేశ్వర రెడ్డి , శ్రీ మూలే బాలకృష్ణా రెడ్డి , వింజమూరు ABVP కన్వీనర్ శ్రీ అకిలి రవికిరణ్, కళాశాల యాజమాన్యం, కొంత మంది పురప్రజలు పాల్గొన్నారు .





